Meher Ramesh Interview | వేదాళమ్ కథలో చిరంజీవినే ఊహించుకున్నా.. భోళా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేశ్ చిట్‌చాట్
Bhola Shankar | చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న మూవీ భోళా శంకర్ (Bhola Shankar).మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మెహర్ రమేశ్ మీడియాతో చిట్ చాట్ చేశాడు. భోళా శంకర్ సినిమా విశేషాలు.. ఆయన మాటల్లోనే..
Bhola Shankar | టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న మూవీ భోళా శంకర్ (Bhola Shankar). వేదాళమ్ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna Bhatia) హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తిసురేశ్ చిరంజీవి సోదరిగా నటిస్తోంది. ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మెహర్ రమేశ్ మీడియాతో చిట్ చాట్ చేశాడు. భోళా శంకర్ సినిమా విశేషాలు.. ఆయన మాటల్లోనే..
చాలా కాలం తర్వాత సినిమాను డైరెక్ట్ చేశారు.. ఎలా అనిపిస్తుంది..?
భోళా శంకర్ షూటింగ్ 2021లో మొదలైంది. టీజర్, ట్రైలర్లో కనిపించే పోర్షన్లు తొలి రోజుల షూటింగ్లో తీసినవే. సెట్స్‌లో 700 మంది జూనియర్ ఆర్టిస్టులుండేవారు. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలను తర్వాత షూట్ చేస్తారు. కానీ మెగాస్టార్ సినిమా కావడంతో మెగా ప్రారంభం చేశాం. చిరంజీవితో సినిమా చేయడం నా కల.. ప్రస్తుతం ఆ కలలో జీవిస్తున్నా.. చిరంజీవిని డైరెక్ట్ చేయడం నా బిగ్టెస్ట్ అఛీవ్మెంట్.
వేదాళమ్ రీమేక్ చేయడానికి కారణం..?
వేదాళమ్ సినిమా ఎంపిక చేయడానికి ప్రధాన కారణం అన్నాచెల్లెలి అనుబంధం. సినిమాలో మహిళల అక్రమ రవాణా గురించి కూడా చూపించాం. వేదాళమ్ కోర్ పాయింట్ మిస్సవకుండా భోళాశంకర్‌లో చాలా మార్పులు చేశాం.
షూటింగ్ టైంలో ఏమైనా సృజనాత్మక విబేధాలు వచ్చాయా..?
డైరెక్టర్ తన నుంచి ఏం కోరుకుంటున్నాడో చిరంజీవికి పూర్తి స్పష్టత ఉంది. ఓ ప్రత్యేకమైన పాత్రలోకి చిరంజీవి అవలీలగా లీనమైపోయారు. అందువల్ల మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేటప్పుడు అంత సమస్యలేమి రాలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో రీమేక్ చేయడం ఎంతవరకు సేఫ్..?
బిల్లా స్టోరీ కొత్తది కాదు.. ఈ సినిమాను పలు భాషల్లో కూడా తెరకెక్కించారు. కానీ సినిమాను తెరకెక్కించిన విధానం బిల్లాను యూనిక్‌గా చూపించింది. చిరుతో సినిమా చేస్తున్నప్పుడు కథ ఆయన ఇమేజ్‌కు సరిపోవాలి. అందుకే వేదాళమ్ ఎంపిక చేసుకుని, తుది మెరుగులు దిద్దాం. ఫైనల్‌గా సినిమా ఎంత వినోదాత్మకంగా ఉందన్నదే ముఖ్యం. భోళాశంకర్ చిరు సార్ మార్క్ ఎంటర్టైనర్.
ఈ ప్రాజెక్ట్‌కు పవన్ కల్యాణ్‌ను ఎందుకు తీసుకోలేదు.. చిరంజీవే ఎందుకు..?
వేదాళమ్ రీమేక్ చేయాలనుకున్నప్పుడు కేవలం మెగాస్టార్ చిరంజీవినే ఊహించుకున్నా. పవన్ కల్యాణ్ ఏఎం రత్నం గారితో మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత రద్దయినట్టు తెలుసుకుని, ఈ కథను చిరంజీవితో చేయాలని అనుకున్నా.
చిరంజీవి సోదరిగా కీర్తిసురేశ్‌ను తీసుకోవడానికి కారణం..?
చిరంజీవి పక్కన కీర్తిసురేశ్ లాంటి గొప్ప నటి అవసరమనుకున్నాం. మొదట ఆమె ఈ సినిమ చేయదనుకున్నా. కీర్తిసురేశ్‌కు కథ వినిపించేలా చేసిన స్వప్నాదత్కు కృతజ్ఞతలు చెప్పాలి. వ్యక్తిగతంగా కీర్తిసురేశ్ అంతగా పరిచయం లేదు. ఆమె కథ వింటున్నప్పుడు చాలా భావోద్వేగానికి లోనై.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
భోళాశంకర్ మేకింగ్ స్టిల్స్..
Frames that captured the essence of bholaa on the sets❤️🔥
Here are a few making stills of #BholaaShankar 💥
Mega🌟@KChiruTweets
A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @sagarmahati @dudlyraj @akentsofficial… pic.twitter.com/hJVccGt5ip— AK Entertainments (@AKentsOfficial) August 8, 2023
డబ్బింగ్ స్టూడియోలో చిరంజీవి..
So it’s a wrap for #BholaaShankar dubbing!
Very pleased to see how the film has shaped up. It is a sure fire mass entertainer and will appeal to the audiences in a big way! Mark your calendars! See you at the Movies!! #BholaaShankarOnAug11 pic.twitter.com/3ufoWJAwqp— Chiranjeevi Konidela (@KChiruTweets) July 6, 2023
భోళాశంకర్ ట్రైలర్..
మిల్కీ బ్యూటీ ప్రోమో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

