‘బుట్టబొమ్మ’ అలరిస్తుంది
‘బాలనటిగా సినిమాల్లో నటిస్తూ వచ్చాను. ఇప్పుడిలా హీరోయిన్లా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ‘కప్పేల’ మలయాళ వెర్షన్ చూశాను. చాలా నచ్చింది. ఇప్పుడు అదే సినిమా రీమేక్‌లో కథానాయికగా నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అన్నారు అనిక సురేంద్రన్.
‘బాలనటిగా సినిమాల్లో నటిస్తూ వచ్చాను. ఇప్పుడిలా హీరోయిన్లా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ‘కప్పేల’ మలయాళ వెర్షన్ చూశాను. చాలా నచ్చింది. ఇప్పుడు అదే సినిమా రీమేక్‌లో కథానాయికగా నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అన్నారు అనిక సురేంద్రన్. ఆమె నాయికగా నటిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం అనిక సురేంద్రన్ విలేఖర్ల సమావేశంలో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు.
ఆమె మాట్లాడుతూ ‘ఈ చిత్రంలోని నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. నటనకు ఆస్కారమున్న పాత్ర. మాతృక ‘కపేలా’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి తగ్గట్గుగా కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ ఫిల్మ్ కంటే కూడా ఇది ఇంకా కలర్ఫుల్గా ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్ర దర్శకుడు రమేష్ గారు నటన పరంగా ఎన్నో మెలకువలు నేర్పించారు. నాకు తెలుగు పూర్తిగా రాకపోయినా సన్నివేశాల తాలూకు ఎమోషన్స్ వివరించి నటనను రాబట్టుకున్నారు. కథానాయికగా ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమిది. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాతో పాటు మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే మూవీలో నాయికగా నటిస్తున్నాను. కొన్ని తెలుగు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

