Shah Rukh Khan | నా భర్త కంటే మీరే ఎక్కువ ఇష్టం.. అభిమాని మాటలకు షారుఖ్ అదిరిపోయే రిప్లై!
KingKhan | వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ తనదైన చమత్కారంతో, తనదైన మాటాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోవడం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కే చెల్లింది.
Shah Rukh Khan | వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ తనదైన చమత్కారంతో, తనదైన మాటాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోవడం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కే చెల్లింది. తాజాగా కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అక్కడ ఓ మహిళా అభిమాని అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. జూన్ 25న మంగళూరులో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి షారుఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. షారుఖ్ స్టేజ్ పైకి రాగానే ఆయన స్థానిక కన్నడ భాషలో “నమస్కారం” అంటూ మాట్లాడటం అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విమానాశ్రయం నుండి వేదిక వరకు తనకు లభించిన అపూర్వ స్వాగతంపై షారుఖ్ హర్షం వ్యక్తం చేస్తూ మంగళూరు ప్రజల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఈ వేడుకలో భాగంగా జరిగిన అభిమానుల ముఖాముఖి సెషన్లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సదరు మహిళా అభిమాని మైక్ తీసుకుని, నా భర్త కంటే నేను మిమ్మల్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ షారుఖ్‌పై తనకున్న అభిమానాన్ని బహిరంగంగా చాటుకుంది. ఇక ఈ ఊహించని వ్యాఖ్యలకు బాలీవుడ్ కింగ్ ఖాన్ ఏమాత్రం తడబడకుండా, తనదైన స్టైల్లో స్పందించారు. “ఇలాంటి రహస్యాలు అందరి ముందు కాకుండా ఒంటరిగా చెప్పాలి కదా!” అంటూ చమత్కరించడంతో హాలంతా నవ్వులు విరిశాయి. అక్కడితో ఆగకుండా ఆ అభిమాని భర్తకు ఇబ్బంది కలగకుండా షారుఖ్ పరిస్థితిని ఎంతో హుందాగా మార్చేశారు. “మీ భావాలను నేను గౌరవిస్తాను. మీ భర్త కూడా దీనిని సరదాగానే తీసుకుంటారని భావిస్తున్నాను. మీతో పాటు మీ భర్తకు, మీ కుటుంబ సభ్యులందరికీ నా తరపున ప్రత్యేక ప్రేమలు” అంటూ షారుక్ చెప్పుకోచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. షారుఖ్ ఖాన్ కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఎంతటి సమయస్ఫూర్తి, హాస్యచతురత కలిగిన వ్యక్తి అనడానికి ఈ ఘటనే నిదర్శనమని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ని రికార్డులు సృష్టించినా, అభిమానుల పట్ల ఆయన చూపించే గౌరవమే ఆయన్ను ఎప్పటికీ ‘బాద్షా’గా నిలబెడుతుందని మరోసారి నిరూపితమైంది.
SRK Fangirl: I love you more than my husband 😍#ShahRukhKhan: Ye akele me batana tha, public me nahi 😂 pic.twitter.com/Pp3wjKFfFL
— $@M (@SAMTHEBESTEST_) June 26, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

