Ravi Teja | కథ చెప్పినపుడు నవ్వీ నవ్వీ చచ్చాను.. మట్టీ కుస్తీ ఈవెంట్లో రవితేజ
మట్టి కుస్తీ (Matti Kusthi) మూవీ డిసెంబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తమిళంలో గట్ట కుస్తి టైటిల్‌తో విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
కోలీవుడ్ హీరో విష్ణువిశాల్ (Vishnu Vishal), ఐశ్వర్య లక్ష్మి కాంబినేషన్లో వస్తున్న చిత్రం మట్టి కుస్తీ (Matti Kusthi). చెల్ల అయ్యవు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తమిళంలో గట్ట కుస్తి టైటిల్‌తో విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
మట్టికుస్తీ చిత్రానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ రవితేజ ఈవెంట్లో మాట్లాడుతూ.. జస్టిన్ ప్రభాకరన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తనకు బాగా నచ్చిందన్నాడు రవితేజ. ఆయనతో కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నానని చెప్పాడు. ధమాకా, రావణాసుర సినిమాలకు కూడా పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రిచర్డ్స్కు కృతజ్ఞతలు చెప్పాడు రవితేజ.
డైరెక్టర్ చెల్లా అయ్యవుకు విచిత్రమైన హాస్యం పండించే టాలెంట్ ఉంది. ఆయన ఈ కథ చెప్పినపుడు నవ్వీ నవ్వీ చచ్చాను. ఈయనతో ఖచ్చితంగా సినిమా చేయాలన్నాడు రవితేజ. అందం, ప్రతిభ కలగలిసిన నటి ఐశ్వర్య లక్ష్మి. ఈ ఈవెంట్‌కు అభిమానులే ముఖ్య అతిథులు. విష్ణు విశాల్ చాలా పాజిటివ్ స్వభావం ఉన్న వ్యక్తి.. తక్కువ సమయంలోనే తాము బాగా కనెక్ట్ అయ్యామన్నాడు రవితేజ.
మట్టికుస్తీ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ రవితేజ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని.. అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు రవితేజ. హోం బ్యానర్లు ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ పై విష్ణువిశాల్-రవితేజ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మట్టి కుస్తీ గ్లింప్స్ వీడియో, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇందులో విష్ణు విశాల్ రెజ్లర్ (కుస్తీ వీరుడు)గా నటిస్తున్నాడు.
మట్టి కుస్తీ గ్లింప్స్ వీడియో..
మట్టి కుస్తీ ట్రైలర్..
మట్టీ కుస్తీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు
A memorable night with my #MattiKusthi fam❤️
Enjoy our film in theatres from DEC 2nd! @TheVishnuVishal #AishwaryaLekshmi @VVStudioz @RTTeamWorks @ChellaAyyavu @itswetha14 @srinu10477 pic.twitter.com/qAexR4sE1c
— Ravi Teja (@RaviTeja_offl) November 27, 2022
Beautiful #AishwaryaLekshmi from the Pre Release Event of #MattiKusthi ❤️🔥
Watch Live here!
▶️ https://t.co/V1iynmSQSXIN CINEMAS FROM DEC 2nd 💥@Raviteja_offl @TheVishnuVishal @VVStudioz @RTTeamWorks @ChellaAyyavu @itswetha14 @saregamasouth @shreyasgroup pic.twitter.com/6tBl9XMBYZ
— RT Team Works (@RTTeamWorks) November 27, 2022
Read Also : PushpaTheRise | రష్యా బాక్సాఫీస్ గెట్ రెడీ అంటున్న పుష్పరాజ్.. వివరాలివే
Yogi Babu | సూర్య 42 సెట్స్‌లో కేక్ కట్ చేసిన స్టార్ కమెడియన్.. స్పెషల్ ఏంటో తెలుసా..?
SSMB28 | ఎస్ఎస్ఎంబీ 28 నాన్‌స్టాప్ షూటింగ్‌కు మహేశ్‌బాబు ప్లాన్..!
Read Also : Apsara Rani | జలపాతం రమ్మంటోంది.. అప్సరస దిగొచ్చిందా.. అప్సరా రాణికి నెటిజన్లు ఫిదా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

