‘ఇలాంటి కథ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. నాకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్బస్టర్ హిట్ కొడుతున్నాం’ అన్నారు నాగశౌర్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి దర్శకుడు. యుక్తి తరేజా నాయిక. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది.
శనివారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ ‘ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ ఉంటుంది. దర్శకుడు బాధ్యతగా, నిజాయితీగా సినిమా తీశాడు. భవిష్యత్తులో పెద్ద డైరెక్టర్ అవుతాడు’ అన్నారు. ‘ఈ సినిమాలో నాగశౌర్య హీరోయిజం మరో స్థాయిలో ఉంటుంది. ఆయన కెరీర్లో విభిన్న చిత్రంగా నిలిచిపోతుంది’ అని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకులు కిషోర్ తిరుమల, శ్రీకాంత్ ఓదెల తదితరులు పాల్గొన్నారు.