Abhishek Bachchan | సినిమాల రీమేక్ సహజమే..’పాన్ ఇండియా’ పై నమ్మకం లేదు
ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలైన దస్వీ (Dasvi) చిత్రం మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా బీటౌన్ మీడియాతో చిట్‌చాట్ చేశాడు అభిషేక్ బచ్చన్. పాన్ ఇండియా పదం (pan-India films)పై తనకు అంత నమ్మకం లేదన్నాడు అభిషేక్ .
ఇటీవలే చదువు ప్రాధాన్యతను తెలియజేసే కథాంశంతో (Abhishek Bachchan) నటించిన చిత్రం దస్వీ (Dasvi). ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా బీటౌన్ మీడియాతో చిట్‌చాట్ చేశాడు అభిషేక్ బచ్చన్. చిట్ చాట్‌లో పాన్ ఇండియా ఫిలిమ్స్ గురించి మాట్లాడుతూ..పాన్ ఇండియా పదం (pan-India films)పై తనకు అంత నమ్మకం లేదన్నాడు. ఈ పదాన్ని ఇంకేదైనా ఇండస్ట్రీ వాడుతున్నామా..? లేదు కదా..? అన్నాడు. సినిమాకు ఏ భాషతో సంబంధం లేదు. మనమంతా వివిధ భాషల్లో పనిచేసినా ..అందరమూ భారత సినీ పరిశ్రమలో భాగమేనన్నాడు.
మంచి సినిమా సక్సెస్ అవుతుంది. లేదంటే ఆ సినిమా వర్కవుట్ కాదు. కెజిఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ భారీవిజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలు ఎప్పుడూ బాగా ప్రజాదరణ పొందాయి. అన్ని ఇండస్ట్రీల్లో ఆసక్తికరమైన కంటెంట్ వస్తుందని అభిషేక్ బచ్చన్ చెప్పుకొచ్చాడు. అలియాభట్ నటించిన గంగూబాయి కథియావాడి, అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన సూర్యవంశీ చాలా బాగా ఆడాయని, ఫైనల్‌గా ప్రేక్షకులకు వినోదం మాత్రమే కావాలని అన్నాడు అభిషేక్.
ఏ సినీ పరిశ్రమను లేబుల్ చేయడం సరైంది కాదు. హిందీలో లేదా ఏ భాషలో అయినా సినిమాలు రీమేక్ చేయడం సహజంగా జరిగేదే. ఇది కొత్తేమీ కాదు. అన్ని సమయాలలో ఎప్పుడూ మార్పిడి (కంటెంట్) జరుగుతూనే ఉంటుంది. ఇందులో తప్పేమీ లేదు. సినిమాలను రీమేక్ చేయడం అనేది ఛాయిస్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు అభిషేక్ బచ్చన్. ప్రస్తుతం మయాంక్ శర్మ డైరెక్షన్లో చేస్తున్న Breathe: Into The Shadows వెబ్ సిరీస్ మూడో సీజన్ షూట్లో పాల్గొంటున్నాడు అభిషేక్ బచ్చన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

