BRO The Avatar | టాలీవుడ్లో ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో రాబోతున్న తాజా ప్రాజెక్ట్ బ్రో (Bro The Avatar). సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. బ్రో జులై 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతుండగా.. ఇప్పటికే హైదరాబాద్ శిల్పకళా వేదికలో బ్రో Pre Release Eventకూడా నిర్వహించారు మేకర్స్. తాజాగా సాయిధరమ్ తేజ్ మీడియాతో చిట్ చాట్ చేశాడు.
నా తొలి సినిమా నుంచి బ్రో వరకు పవన్ కల్యాణ్ నాకు మద్దతుగా నిలుస్తూ.. ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. ఈ సినిమా చేయడానికి ఒకే కారణం పవన్ కల్యాణ్. ఈ చిత్రాన్ని ఆయనకు, నా కెరీర్‌కు డెడికేట్ (అంకితం) చేస్తున్నా. బ్రో సెట్స్‌లోని ఆయనను చూస్తూ పనిచేయడం నాకు గొప్ప పాఠమని చెప్పుకొచ్చాడు సాయిధరమ్ తేజ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏదో మ్యాజిక్ చేస్తుంది. వెంకటేశ్, నాగచైతన్యతో వెంకీ మామ చేశారు. ఇప్పుడు పవన్‌కల్యాణ్, నాతో బ్రో సినిమా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా సపోర్టుగా ఉంటారు. వారితో సినిమా చేసేందుకు ఎప్పుడైనా రెడీగా ఉంటా.
ఇప్పటికే మేకర్స్ బ్రో బీటీఎస్ ఫొటోలను షేర్ చేయగా.. పవన్ కల్యాణ్ డిఫరెంట్ గెటప్స్‌లో నిర్మాత వివేక్ కూచిబొట్ల, త్రివిక్రమ్ అండ్ టీంతో చిట్ చాట్ చేస్తున్న స్టిల్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. బ్రో టీజర్, ట్రైలర్‌తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. బ్రో నుంచి విడుదల చేసిన మై డియర్ మార్కండేయ, రొమాంటిక్ మెలోడి జానవులే లిరికల్ వీడియో సాంగ్‌తోపాటు థీమ్ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. సాయి ధరమ్ తేజ్, టైమ్ లైన్, పవన్ కల్యాణ్ మధ్య సాగే ఘటనల నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు సముద్రఖని.
ఈ చిత్రంలో సీనియర్ నటి రోహిణి, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు.
బ్రో వర్కింగ్ స్టిల్స్..
My Time with #BRO
Infinite Interactions …@PawanKalyan garu@peoplemediafcy @vishwaprasadtg garu@thondankani garu pic.twitter.com/V3dIF6jyWh— Vivek Kuchibhotla (@vivekkuchibotla) July 25, 2023
బ్రో ట్రైలర్..
బ్రో టీజర్..
జానవులే లిరికల్ వీడియో సాంగ్..
మై డియర్ మార్కండేయ సాంగ్..