Anjali | అలాంటి సీన్లలో నటించినప్పుడు క్యారవాన్‌లోకి వెళ్లి ఏడ్చేదాన్ని : అంజలి
అంజలి.. పేరుకు తెలుగు నటినే అయిన తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకుంది. 'ఫోటో' సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అంజలికి.. మొదటి సినిమానే దెబ్బ కొట్టింది. దాంతో టాలీవుడ్లో అవకాశాల కొదవ ఏర్పడింది.
Actress Anjali | టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ వైపు హీరోయిన్గా, మరో వైపు వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ దక్షిణాదిన ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె రామ్‌చరణ్-శంకర్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వూలో ముద్దు, రొమాంటిక్ సీన్లలో నటించడం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. కొన్ని సార్లు పాత్రకు తగ్గట్లు ముద్దు సీన్లలో నటించాల్సి వస్తుందని, మనకు ఇష్టంలేని వ్యక్తిని ముద్దు పెట్టకోవడం ఇబ్బందేనని వెల్లడించింది. అంతేకాకుండా కొన్ని సార్లు రొమాంటిక్ సిన్స్లో నటించినప్పుడు క్యారవాన్‌లోకి వెళ్లి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయిని చెప్పుకొచ్చింది. అయినా సీన్ పండటం కోసం నటించాల్సి వస్తుందని ఎమోషనల్ అయింది.
అంజలి.. పేరుకు తెలుగు నటినే అయిన తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకుంది. ‘ఫోటో’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అంజలికి.. మొదటి సినిమానే దెబ్బ కొట్టింది. దాంతో టాలీవుడ్లో అవకాశాల కొదవ ఏర్పడింది. ఈ క్రమంలో కోలీవుడ్‌కు మకాం మార్చింది. ‘కట్రదు తమిజా’ సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ సాధించింది. ఇక దాంతో వరుసగా తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చింది. కాగా మళ్ళీ ఏడేళ్లకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ చెట్టు సినిమాతో తెలుగులో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా అంజలికి టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘బలుపు’, ‘గీతాంజలి’, ‘వకీల్‌సాబ్’ వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

