OG | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ చిత్రాల్లో ఒకటి ఓజీ (OG). సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే HUNGRYCHEETAH హ్యాష్‌ట్యాగ్‌తో ఓజీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సీనియర్ యాక్టర్ వెంకట్ (venkat)ఓజీలో కీ రోల్ చేస్తున్నాడు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఓజీ గురించి మాట్లాడాడు. ఓజీలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని చెప్పాడు. సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.. అలా చెప్తే సుజిత్ నన్ను చంపేస్తడు. ఎందుకంటే ఓజీ హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీ స్థాయిలో వస్తుంది. టాలెంటెడ్ యాక్టర్లు భాగస్వామ్యమైన ఓజీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మరో భారీ సినిమా కానుంది. గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ అదరగొట్టేశాడు.. విజువల్స్ ఔరా అనిపించేలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు వెంకట్.
గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ ఓవైపు వారియర్‌గా.. మరోవైపు స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. పవన్ కల్యాణ్ మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే లాంఛ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. పవన్ కల్యాణ్ మరోవైపు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహరవీరమల్లులో నటిస్తున్నాడు.
ఓజీ గ్లింప్స్..
ఓజీ షూట్ లొకేషన్లో వెంకట్ ఇలా..
Hero #Venkat Doing Important role in @PawanKalyan‘s #TheyCallHimOG 🔥 pic.twitter.com/pa44ZqfI9X
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) October 29, 2023