Samantha | గతం కంటే బలంగా ఉన్నా..చైతూ గురించి సామ్ ఏమన్నదంటే..!
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హాట్ స్టార్ షో కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) 7వ ఎపిసోడ్లో సందడి చేసింది సమంత (Samantha).
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హాట్ స్టార్ షో కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) 7వ ఎపిసోడ్లో సందడి చేసింది.కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమనిచ్చింది. మీ భర్త గురించి ఏదైనా చెప్పండి అంటుండగానే..సామ్ కలగజేసుకుని మాజీ భర్త అని సవరించండి అని చెప్పింది.
ఇక విడాకుల తర్వాత నాగచైతన్య (Naga Chaitanya)తో సంబంధం ఎలా ఉంటుందని కరణ్ ప్రశ్నించాడు. దీనికి సామ్ స్పందిస్తూ..అంటే మా ఇద్దరినీ ఒక గదిలో ఉంచినట్టైతే..పదునైన వస్తువులను దాచవలసి ఉంటుందా..? ప్రస్తుతానికి..అవును..అంటూ సమాధానమిచ్చింది.
విడాకుల సమయంలో తనపై జరిగిన సోషల్ మీడియా ట్రోలింగ్, మాటల దాడి గురించి చెప్తూ..
దాని గురించి నేను నిజంగా ఫిర్యాదు చేయలేకపోయాను..కారణం నేనా మార్గాన్ని ఎంచుకున్నా. నేను పారదర్శకంగా ఉండాలని, బయటపెట్టాలని అనుకున్నా. విడిపోయినపుడు..నేనంతగా అప్సెట్ అవ్వలేదు..ఎందుకంటే వాళ్లు నా జీవితంలో పెట్టుబడి పెట్టారు. అది నా బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన సమయం కానీ..చేయలేకపోయా. ఇక దాని నుంచి నేను బయటకు వచ్చాననుకుంటున్నా. ఇది చాలా కష్టం..కానీ ఇపుడు ఒకే. బాగుంది. తాను గతంలో కంటే చాలా బలంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.
చివరగా కరణ్ జోహార్ పెళ్లి గురించి సమంతను అడుగగా..సంతోషం లేని వివాహాలకు కారణం మీరే. మీరు జీవితాన్ని K3G (కభీ ఖుషీ కభీ ఘమ్)గా చిత్రించారు..అంటూ కౌంటర్ ఇచ్చింది సామ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

