గౌతమ్‌కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జీకే ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై గౌతమ్కృష్ణకు దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. మనోజ్ డి జె, డా॥ మణికంఠ నిర్మాతలు. ఈ సినిమా నుంచి ‘శిలగా ఇలా నేనే మిగిలానుగా..జతగా నువ్వులేని ఏకాకిగా..’ అనే పాటను విడుదల చేశారు. చైతన్యప్రసాద్ రచించిన ఈ గీతాన్ని కాళభైరవ ఆలపించారు. హృదయాన్ని హత్తుకునే ప్రేమకథా చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, సంగీతం: జూడా శాండీ, రచన-దర్శకత్వం: గౌతమ్‌కృష్ణ.