హైదరాబాదీ కథానాయిక టబూ కొంతకాలంగా వరుస సినిమాలు చేస్తున్నది. హిందీ ‘దృశ్యం-2’లో మీరా దేశ్‌ముఖ్ పాత్రతో అందరి మనసులూ దోచుకున్నది. ఇటీవల ‘కుట్టీ’ అనే సినిమాలో పోలీసు అధికారిగా కనిపించింది. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అలరించకపోయినా, టబూ పాత్రకు మాత్రం మంచి పేరొచ్చింది. “భూల్ భులయ్యా-2’, ‘దృశ్యం-2’ రెండు చిత్రాల్లో భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది. కుట్టీ సినిమాలోనూ మంచిపాత్ర పోషించే అవకాశం వచ్చింది.
ఈ చిత్ర దర్శకుడు ఆస్మాన్ భిన్నమైన ఫిల్మ్‌మేకర్. ఆయన ఆలోచనలు తన తండ్రి డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ మాదిరిగానే ఉంటాయి. కానీ, పనిచేసే విధానం కొత్తగా ఉంటుంది. గతంలో విశాల్జీ నాకు ఇచ్చిన పాత్రలన్నీ క్లిష్టమైనవే! ఆయనతో పనిచేసేటప్పుడు చాలా ఫ్రీగా అనిపించేది. మిగతావాళ్లతో పోలిస్తే ఆయనతో నాకున్న క్రియేటివ్ బాండింగ్ ప్రత్యేకమైంది. ఇప్పుడు వారి అబ్బాయి ఆస్మాన్తోనూ అంతే! ‘కుట్టీ’లో నా పాత్రను ప్రేమించేలా తీర్చిదిద్దాడు. ఎంతో ఇష్టపడి ఆ పాత్ర చేశాను. ఈ ప్రయాణం బాగా ఎంజాయ్ చేశానని చెబుతున్నది టబూ.