భావోద్వేగాలకు గురిచేస్తుంది
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘హంట్'. శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘హంట్’. శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు మహేష్ రూపొందించారు. ఈ నెల 26న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు దర్శకుడు మహేష్. ఆయన మాట్లాడుతూ…‘దర్శకుడిగా నా ద్వితీయ ప్రయత్నమిది. ముందుగా ఒక లవ్‌స్టోరి మూవీ చేయాలని అనుకున్నాం కానీ కుదరలేదు.
ఈ కథ నచ్చి సుధీర్ బాబుతో మొదలుపెట్టాం. ఒక ప్రమాదంలో గతం మర్చిపోయిన ఓ పోలీస్ అధికారి కథ ఇది. తన జీవితంలో ఆ దుర్ఘటన ఎలా జరిగింది? దానికి కారణం ఎవరు? అని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. సుధీర్ బాబుకు ఇది ద్విపాత్రాభినయం లాంటి చిత్రం అనుకోవచ్చు. ముందు ైస్టెలిష్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించే అతను, గతం మర్చిపోయిన తర్వాత నిస్పృహకు లోనవుతాడు. గజినీ చిత్రంతో ఈ సినిమాను పోల్చవద్దు. అందులో హీరో గతాన్ని పూర్తిగా మర్చిపోడు. ఇక్కడ కంప్లీట్‌గా మెమొరీ లాస్ అవుతుంది. సుధీర్ బాబు కెరీర్లో ఇదొక బెస్ట్ మూవీ అవుతుంది.
భరత్‌ను ‘ప్రేమిస్తే’ చిత్రంతో మన ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. ఆయనకు టైలర్‌మేడ్ క్యారెక్టర్ ఇది. ఫారిన్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ హైలైట్ అవుతాయి. ఇవాళ ప్రేక్షకులు కొత్తతరహా చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఆ నమ్మకంతోనే ఈ సినిమాను రూపొందించాం. సినిమాలో మిమ్మల్ని భావోద్వేగాలకు గురిచేసే అంశాలుంటాయి. తప్పకుండా ఎమోషనల్ అవుతారు. త్వరలో కొత్త సినిమా ప్రకటిస్తా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

