Hunt Movie | సుధీర్ బాబు వేట మొదలు పెట్టేది అప్పుడే.. హంట్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. గత కొంత కాలంగా ఈయన సినిమాలను ప్రేక్షకుల ఆదరిస్తున్నా.. కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోతున్నాయి.
Hunt Movie Release Date | హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా కథా బలమున్న సినిమాలు చేస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్‌బాబు. అయితే ఈయన సినిమాలకు పాజిటీవ్ టాక్ వస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి. ఇటీవలే ఈయన నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా కూడా మొదట పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ, ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్‌ను సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం సుధీర్‌బాబు కమర్షియల్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.
ఈ క్రమంలో ‘హంట్’ అనే యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. మహేష్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సుధీర్ కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతుందట. ఇప్పటికే చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంది. హీరో శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమాకు మార్వెల్, జాన్ విక్ వంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన రేనాడ్ బ్రయాన్ హంట్ ఈ సినిమాకు స్టంట్స్ కంపోజ్ చేశారు.
Keep the guns loaded!!
The hunt begins on Jan 26th! 😎 #HuntTheMovie#HuntFrom26Jan@bharathhere @actorsrikanth @Imaheshh @ChitraShuklaOff #Anandaprasad @BhavyaCreations @GhibranOfficial pic.twitter.com/4hhENU4dB8— Sudheer Babu (@isudheerbabu) December 30, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

