Hunt Movie On OTT | కెరీర్ బిగెనింగ్ నుండి కథాబలమున్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. ఇండస్ట్రీకి వచ్చి 13ఏళ్లు దాటినా ఇంకా టైర్2 హీరో స్టేటస్‌ను కూడా అందుకోలేకపోతున్నాడు. ప్రేమకథాచిత్రం, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే వంటి మంచి మంచి చిత్రాలు చేసినా సుధీర్‌కు ఎందుకో రావాల్సిన గుర్తింపు రాలేదు. ఇక భారీ అంచనాలతో ఇటీవలే రిలీజైన ‘హంట్’ కూడా సుధీర్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. మహేష్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది.
ఎప్పుడో పదేళ్ల క్రీతం మలయాళంలో వచ్చిన ‘ముంబై పోలీస్’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ముందు నుండి ఈ సినిమాను రీమేక్ అన్నట్లు ప్రచారం చేయలేదు. కానీ ముంబై పోలీస్ చూసిన ప్రతీ ఒక్కరికి హంట్ రీమేక్ సినిమానే అని ఇట్టే తెలిసిపోతుంది. ఇంతకుముందంటే ఇతర భాషల సినిమాలను మనవాళ్లు ఎక్కువగా పట్టించుకోలేకపోయారు. కానీ ఓటీటీల పుణ్యమా అని భాషతో సంబంధంలేకుండా మంచి మంచి సినిమాలను వెతికి మరీ చూస్తున్నారు. ఇక ఇప్పటికీ మలయాళంలో ది బెస్ట్ థ్రిల్లర్ మూవీస్‌లో ముంబై పోలీస్ కచ్చితంగా ఉంటుంది. అలాంటి సినిమాను మూవీ లవర్స్ ఇప్పటికే చాలా మంది చేసేసారు. దాంతో హంట్ సినిమాకు తొలిరోజు నుండే రీమేక్ అనే ముద్ర పడిపోయింది. ఈ సినిమా ఫేయిల్యూర్కు పఠాన్ మూవీ కూడా కారణం. తెలుగులోను పఠాన్ జోరు కొనసాగుతుండటంతో హంట్ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకులు పట్టించుకోలేదు.
ఇదిలా ఉంటే ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. కాగా ముందుగా మేకర్స్ ఈ సినిమాను నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలని ప్రైమ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ సినిమా ఫలితం తేడా కొట్టడంతో రెండు వారాల ముందుగానే మరో డీల్‌తో రెండు వారాల ముందు అంటే ఫిబ్రవరి 10నుండి ఈ సినిమాను స్రీమింగ్ చేయనున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.