Thaialvar 170 Movie | సూపర్ స్టార్‌ను చూడడానికి వచ్చిన వందలాది కేరళ ఫ్యాన్స్.. వీడియో వైరల్..!
Thaialvar 170 Movie | సూపర్ స్టార్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా తిరుగులేని అభిమానగళంతో ఆలిండియా సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నాడు. అందరు హీరోలకు వాళ్ల సొంత రాష్ట్రాల్లో మాత్రమే విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు.
Thaialvar 170 Movie | సూపర్ స్టార్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా తిరుగులేని అభిమానగళంతో ఆలిండియా సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నాడు. అందరు హీరోలకు వాళ్ల సొంత రాష్ట్రాల్లో మాత్రమే విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఒక్క రజనీకాంత్‌కు మాత్రం యావత్ ఇండియాలో అభిమానులున్నారు. రజనీ సినిమా వస్తుందంటే థియేటర్ల ముందు భారీ భారీ కటౌట్లు, ఈలలు, గోలలతో ఒక పెద్ద పండగ వాతావరణమే కనిపిస్తుంది. ఇక జైలర్‌తో వీర లెవల్లో కంబ్యాక్ ఇచ్చిన రజనీ.. అదే ఊపుతో తన 170వ సినిమా చేస్తున్నాడు. జైభీమ్ దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్‌ను ప్రారంభించింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువునంత పురంలోని అగ్రీకల్చర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరుగుతుంది. రజనీని చూసేందుకు అక్కడికి కేరళ ఫ్యాన్స్ తండోపతండాలుగా వచ్చారు. క్యారవాన్‌లో నుంచి దిగి రజనీ వాళ్లందరికి హాయ్ చెబుతూ ఉన్నాడు. షూటింగ్ స్పాట్లో సుమారు వందల్లో జనాలున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై పలువరు నెటిజన్లు.. అది తలైవా క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో షూటింగ్ నుంచి సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెంచేసిన సినిమా ఏదైనా ఉందంటే అది ఈ సినిమానే. రోజుకో కాస్ట్‌ను రివీల్ చేస్తూ అంతకంతకూ సినిమాపై ఎక్సట్పెక్టేషన్స్ పెంచుకుంటూ వస్తున్నారు. అమితాబ్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్ ఇలా సౌత్‌లోని పలు ఇండస్ట్రీల నుంచి స్టార్ కాస్ట్‌ను తీసుకుని సినిమా స్కేల్‌ను పెంచారు.
ఇక జైభీమ్ తర్వాత T.G.జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఈ సినిమా కూడా జై భీమ్ తరహాలోనే సోషల్ మేసేజ్‌తో ముడిపడి ఉండనుందట. అయితే దానికి రజనీ స్వాగ్‌ను కూడా యాడ్ చేసి ఊహించని రేంజ్లో సినిమాను తీయబోతున్నారట. డబ్బులను మంచి నీళ్లలా ఖర్చు పెట్టే లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. జైలర్‌తో ఊరమాస్ మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
Superstar @rajinikanth today morning on location of #Thalaivar170 at Vellayani Agricultural University Campus, in Thiruvananthapuram. pic.twitter.com/7m7o44XWF7
— Sreedhar Pillai (@sri50) October 7, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

