ప్రముఖ చెఫ్ తార్లా దలాల్ బయోపిక్‌లో నటించబోతున్నది బాలీవుడ్ తార హ్యూమా ఖురేషి. 80,90 దశకాల్లో వంట పుస్తకాలు రాసి ఖ్యాతి పొందారు రచయిత తార్లా దలాల్. వంటల గురించి ఆమె రాసిన 100కు పైగా పుస్తకాలు కోటి ప్రతులు అమ్ముడయ్యాయి. ఆ కాలంలో మధ్య తరగతి వంటింట్లో ఆమె వంటల పుస్తకం తప్పక ఉండేదని ప్రతీతి. తార్లా దలాల్ జీవిత కథను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను హ్యూమా ఖురేషి పోషించనుంది. ఈ చిత్ర అవకాశంపై హ్యూమా సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక ఆమె నటించిన ‘ఆర్మీ ఆఫ్ ద డెడ్’ ఆస్కార్ పురస్కారాల్లో ఫ్యాన్ ఫేవరేట్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి జాక్ స్నిడర్ దర్శకత్వం వహించారు. ఓటీటీలో విడుదలైంది. తన సినిమాకు ఆస్కార్ రావడంపై హ్యూమా ఖురేషి పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆస్కార్‌లో ఫ్యాన్ ఫేవరేట్ అవార్డు కేటగిరీని ఈ ఏడాదే ప్రవేశపెట్టారు. ఇది అధికారిక అవార్డ్ కాదు కానీ వీలైనన్ని ఎక్కువ సినిమాలను ప్రోత్సహించేందుకు ప్రకటిస్తున్నారు.