Hrudhayam Murali | 22 ఏళ్ల తర్వాత నటుడిగా థమన్.. ఆసక్తికరంగా ‘హృదయం మురళి’ ట్రైలర్
Atharvaa | కోలీవుడ్ యంగ్ హీరో అథర్వ మురళి, మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'హృదయం మురళి' (Idhayam Murali).
Thaman S | కోలీవుడ్ యంగ్ హీరో అథర్వ మురళి, మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘హృదయం మురళి’ (Idhayam Murali). ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒక యువకుడి జీవితంలో ఎదురయ్యే వన్-సైడెడ్ లవ్, భావోద్వేగాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. జీవితం ముందుకు సాగుతున్నా కొన్ని జ్ఞాపకాలు, భావాలు ఎప్పటికీ చెరిగిపోవనే పాయింట్ తో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు మేకర్స్.
ఇక ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, కాయదు లోహర్ కథానాయికలుగా నటిస్తుండగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ నటుడిగా మెరవబోతుండటం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాకు థమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ ఒక పవర్ఫుల్ క్యామియో రోల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెలుగులో అందిస్తుండగా, జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం విడుదలైన ఈ ట్రైలర్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

