Fighter Worldwide Collections : హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ తొలిసారిగా ఆన్‌స్క్రీన్ జోడీగా తెరకెక్కిన ఫైటర్ మూవీ సెకండ్ వీకెండ్లో మెరుగైన వసూళ్లు రాబట్టింది. వీక్ డేస్‌లో భారీగా పడిపోయిన మూవీ కలెక్షన్లు రెండో వారాంతంలో అనూహ్యంగా పుంజుకోవడంతో బాక్సాఫీస్ వద్ద ఫైటర్ నిలకడగా సాగుతోంది.
శనివారం ఫైటర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 15.19 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా ఆదివారం ఏకంగా రూ. 18.46 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సిద్ధార్ధ్ ఆనంద్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం రూ. 9.75 కోట్ల కలెక్ట్ చేయగా సెకండ్ వీకెండ్లో భారీ వసూళ్లను రాబట్టడంతో తిరిగి బాక్సాఫీస్ రేస్‌లో పట్టుబిగించింది.
పదకొండు రోజుల్లో ఫైటర్ మూవీ రూ. 306 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. ఇక హృతిక్ రోషన్, దీపికా పదుకోన్‌తో పాటు అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఓబెరాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
Read More :