ఇటీవలి కాలంలో సౌత్ సినిమాలపై బాలీవుడ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ మంచి విజయం సాధించిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. ఎప్పటి నుండో విక్రమ్ వేద రీమేక్‌పై ఇటు తెలుగు అటు హిందీ భాషలలో చర్చ నడుస్తుంది. తాజాగా హిందీ రీమేక్‌కు సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది.ఒరిజినల్ సినిమాను తెరకెక్కించిన పుష్కర్-గాయత్రి హిందీ రీమేక్‌ని డైరెక్ట్ చేయనుండగా ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించనున్నట్టు పేర్కొన్నారు. 2022 సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
విలక్షణ నటుడు ఆర్.మాధవన్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో పుష్కర్ -గాయత్రి తెరకెక్కించిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేదా’. ఈ మూవీలో మాధవన్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్, విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్ వేద పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం.. కొద్ది కాలంగా ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజా రవితేజ.. విక్టరీ వెంకటేష్, నారా రోహిత్ పేర్లు వినిపించాయి కానీ ఏదీ అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యలేదు.