ODI World Cup 2023 | టాలీవుడ్‌పై వరల్డ్ కప్ ప్రభావం ఎంత.. కలెక్షన్లకు దెబ్బ పడబోతుందా..!
ODI World Cup 2023 | ఇండియాలో క్రికెట్ అనేది కేవలం ఆట కాదు.. ఒక మతం. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు కొన్ని కోట్ల మంది పనులు మానేసుకొని టీవీల ముందు అతుక్కుపోతారు. అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది క్రికెట్‌కు. IPL వస్తేనే ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై దారుణంగా పడుతుంది.
ODI World Cup 2023 | ఇండియాలో క్రికెట్ అనేది కేవలం ఆట కాదు.. ఒక మతం. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు కొన్ని కోట్ల మంది పనులు మానేసుకొని టీవీల ముందు అతుక్కుపోతారు. అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది క్రికెట్‌కు. IPL వస్తేనే ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై దారుణంగా పడుతుంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ వచ్చింది. అందులోనూ వన్డే వరల్డ్ కప్ అంటే రోజంతా క్రికెట్ ఆడుతూనే ఉంటారు ఆటగాళ్లు. ఆ ఎఫెక్ట్ కచ్చితంగా సినిమా కలెక్షన్లపై దారుణంగా పడుతుంది అని నిర్మాతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా మ్యాచెస్ ఉన్న సమయంలో కలెక్షన్స్ పడిపోవడం ఖాయమనేది ట్రేడ్ పండితుల అంచనా.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వరల్డ్ కప్ జరగనుంది. ఈ మధ్యలోనే దసరా సీజన్ ఉండటంతో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి భారీ సినిమాలు విడుదదలవుతున్నాయి. ఆ సమయంలో ఇండియా మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. దానికి తోడు వరల్డ్ కప్ అంటే మిగిలిన మ్యాచ్‌లపై కూడా అందరికీ ఆసక్తి ఉంటుంది. కచ్చితంగా రాబోయే 45 రోజులు తెలుగు ఇండస్ట్రీకి కీలకమే. వరల్డ్ కప్‌ను తట్టుకొని కలెక్షన్లు తెచ్చుకునే సినిమాలు తక్కువగానే ఉంటాయి. కంటెంట్ బలంగా ఉంటే తప్ప కలెక్షన్స్ రావడం కష్టం. దసరా తర్వాత మళ్లీ కొత్త సినిమాలు రావడానికి చాలా టైం ఉంది. మనవాళ్లు దీపావళిని కూడా వదిలేశారు. కాబట్టి వరల్డ్ కప్ టాలీవుడ్ కంటే బాలీవుడ్‌పై ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది.
అక్కడ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా వరుసగా క్యూ కడుతున్నారు. ఇలాంటి టైమ్‌లో వరల్డ్ కప్ ఉండటంతో కలెక్షన్లకు ఎక్కడ దెబ్బ పడుతుందో అని వాళ్లు కూడా భయం భయంగానే ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి టీమ్స్ తో ఇండియా ఆడుతున్న టైంలో కచ్చితంగా రోజంతా క్రికెట్ అభిమానులు ఇంట్లోనే ఉంటారు. దానికి తోడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతాయి. అప్పటి నుంచి రాత్రి 11:30 వరకు మ్యాచ్ జరుగుతుంది. ఈ లెక్కన మూడు షోలపై ప్రభావం తప్పదు. ఎలా చూసుకున్నా కూడా వరల్డ్ కప్ మొదలైన తర్వాత సినిమాలకు కష్ట కాలం కూడా మొదలవుతుంది. మరి దాన్నుంచి ఇండస్ట్రీ ఎలా బయటపడుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

