Bigg Boss: ఆట పాటలతో ఫుల్‌గా ఎంటర్టైన్ చేసిన హౌజ్‌మేట్స్

బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో హౌజ్‌మేట్స్‌కి వినూత్నమైన టాస్క్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఇంటిసభ్యులందరూ సూపర్ స్టార్స్‌లా నటించాల్సి ఉంటుందన్నాడు. అందులో భాగంగా సన్నీ.. బాలయ్య, శ్రీరామ్.. చిరంజీవి, కాజల్.. శ్రీదేవి, మానస్.. పవన్ కల్యాణ్, షణ్ను.. సూర్య, సిరి.. జెనీలియాగా నటించారు. దీంతో ఆయా స్టార్ల పాటలు వచ్చినప్పుడు హౌస్మేట్స్ అందరూ తమదైన శైలిలో డ్యాన్స్ చేసి అదరగొట్టారు.
ఖాళీ సమయంలోను పాత్రలోనే ఉంటూ స్టార్స్వాయిస్తో మాట్లాడుకుంటూ అలరించారు. బాలకృష్ణగా సన్నీ, శ్రీదేవిగా కాజల్, చిరంజీవిగా శ్రీరామ్ ఎక్కువసేపు వారి పాత్రల్లో మాట్లాడుతూ నవ్వులు పంచారు. ఇక డ్యాన్స్ లు వేస్తున్న షణ్ముఖ్ అలిగి కూర్చున్నాడు. అందుకు కారణం సిరి.. సన్నీతో కలిసి డాన్స్ చేయడం. పిలిచినా రావేంట్రా అని సిరి వచ్చి షణ్ముఖ్‌తో అంటే నా సాంగ్‌కి నేను వేస్తాను అంటూ సిరివైపు కోపంగా చూశాడు.
నీ సాంగ్‌కి నేను వస్తానులే.. ఖచ్చితంగా డ్యుయెట్ వేస్తారులే.. అని సిరి అంటే.. సోలో సాంగ్ వేస్తారు.. సోలో వేస్తే నేను మానస్ చేస్తాం అని అంటాడు షణ్ముఖ్. ఒకవేళ అమ్మాయి సాంగ్ వస్తే.. కాజల్‌తో వేస్తావా? అని సిరి అడిగ్గా.. కాజల్‌కి స్టెప్స్ రావుగా మనిద్దరం వేద్దాంలే అని అంటాడు షణ్ముఖ్. మొత్తానికైతే సిరి.. సన్నీతో స్టెప్ వేసేసరికి షన్నూ ముఖం మాడిపోయింది. ఇంతలో బాలయ్య ‘సింహా’ సాంగ్ వేయగా.. సన్నీ డాన్స్ వేస్తూ.. సిరిని ఎంతపిలిచినా.. షన్నూ కనుసైగలకు భయపడి కూర్చునే ఉండిపోయింది. సన్నీ, కాజల్, మానస్లు మాత్రమే డాన్స్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

