Project K | మాటల్లో చెప్పలేను.. కమల్‌హాసన్‌తో ప్రాజెక్ట్ K స్క్రీన్ షేరింగ్‌పై ప్రభాస్
Project K | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి ప్రాజెక్ట్ K (Project k). దశాబ్దాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉలగనాయగన్‌తో కలిసి నటించడం పట్ల చాలా చాలా ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నాడు ప్రభాస్.
Project K | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి ప్రాజెక్ట్ K (Project k). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే , దిశా పటానీ, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal haasan)కూడా ఇందులో వన్ ఆఫ్ ది కీ రోల్ చేస్తున్నాడు. దశాబ్దాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉలగనాయగన్‌తో కలిసి నటించడం పట్ల చాలా చాలా ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నాడు ప్రభాస్.
కమల్‌హాసన్‌కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ.. తన సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు ప్రభాస్. నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం. Project K లో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ సర్‌తో కలిసి పనిచేసినందుకు మాటల్లో చెప్పలేనంత గౌరవంగా భావిస్తున్నా. కల నిజమైన వేళ.. టైటాన్ ఆఫ్ సినిమాతో కలిసి నేర్చుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తన ఎక్జయిట్‌మెంట్‌ను అందరితో పంచుకున్నాడు ప్రభాస్. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో సమానంగా కమల్‌హాసన్ రెమ్యునరేషన్ ఉండబోతున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది.ప్రాజెక్ట్ Kలో కీలకంగా సాగే రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియోను మేకర్స్ ఇప్పటికే విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.ఇప్పటికే విడుదల చేసిన దీపికా పదుకొనే లుక్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించింది నాగ్అశ్విన్ టీం. ప్రభాస్ దీంతోపాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తున్న సలార్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు మారుతి హార్రర్ కామెడీ ప్రాజెక్ట్ కూడా సెట్స్ పై ఉంది.
రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
హాలీవుడ్ రేంజ్లో దీపికాపదుకొనే లుక్..
Here's wishing our @deepikapadukone a very Happy Birthday.#ProjectK #HBDDeepikaPadukone pic.twitter.com/XfCbKapf25
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

