చివరి ఎపిసోడ్ మిస్ కావొద్దు
ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంలో రూపొందిన వెబ్‌సిరీస్ ‘హోం టౌన్'. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ప్రధానపాత్రధారులు.
ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంలో రూపొందిన వెబ్‌సిరీస్ ‘హోం టౌన్’. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ప్రధానపాత్రధారులు. శ్రీకాంత్‌రెడ్డి పల్లే దర్శకుడు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మాతలు. రేపటి నుంచి ఈ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ స్పెషల్ ప్రివ్యూను గురువారం హైదరాబాద్‌లో ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ మాట్లాడారు.
ఈ సిరీస్ ఓ జ్ఞాపకాల దొంతర అని, ఇందులోని పిల్లల అల్లరి చూస్తుంటే ఓ 35ఏళ్లు వెనక్కు వెళ్లిపోయానని, టెక్నికల్‌గా మంచి క్వాలిటీతో రూపొందిన సిరీస్ ఇదని రాజీవ్‌కనకాల పేర్కొన్నారు. ‘90s ఎ మిడిల్‌క్లాస్ బయోపిక్’ తర్వాత తమ సంస్థ నుంచి వస్తున్న సిరీస్ ఇదని, దేవ్ దీప్ గాంధీ కుండు కెమెరా, సురేశ్ బొబ్బిలి సంగీతం ఈ సిరీస్‌కి బ్యాక్‌బోన్ అని నిర్మాత నవీన్ మేడారం చెప్పారు. సొంతూరితో ముడిపడ్డ జ్ఞాపకాల సమాహారం ఈ సిరీస్ అనీ, చివరి ఎపిసోడ్ మాత్రం మిస్ కావొద్దని దర్శకుడు తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ అంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aha
- home town
- ott
- rajeev kanakala
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

