Thalapathy67 | హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో విజయ్ నెక్స్ట్ మూవీ
Thalapathy Vijay Next Movie | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం స్పీడు మీదున్నాడు. వరుసగా కథలను ఓకే చేస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన ‘బీస్ట్’ తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకులే కాదు అభిమానులు కూడా ఈ చిత్ర ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు. ప్రస్తుతం ఈయన వంశీపైడిపల్లి దర్వకత్వంలో నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన విజయ్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రానికి వారసుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి పలువరు హాలీవుడ్ టెక్నీషియన్లను మేకర్స్ రంగంలోకి దింపనున్నారట. ఇటీవలే విడుదలైన విక్రమ్ భారీ విజయం సాధించడంతో లోకేష్‌పై కాస్త భారం పెరిగింది. తన నెక్స్ట్ సినిమాకు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రీచ్ కావడానికీ లోకేష్ గట్టిగానే కష్టపడుతున్నాడు. ఈ సారి ఇంకా బిగ్ స్కేల్లో గ్రాండియర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించే విధంగా ఆలోచిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఈ మూవీలో పనిచేయడం కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. అయితే లోకేష్ విక్రమ్ సక్సెస్ మీట్లో విజయ్‌తో చేయబోయే సినిమాలో విక్రమ్ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లే కంటీన్యూ అవుతారని చెప్పాడు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

