Ranabaali | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లో ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ది మమ్మీ’ సిరీస్‌లో ‘ఇమ్హోటెప్’ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్, ‘రణబాలి’లో ‘సర్ థియోడర్ హెక్టర్’ అనే క్రూరమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు.
‘ది డెమోన్ ఆఫ్ డ్రాట్’ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆర్నాల్డ్ వోస్లో పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్‌ను విడుదల చేస్తూ టీమ్ ‘రణబాలి’ ఆయనకు ఇండియన్ సినిమాకు స్వాగతం పలికింది. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరవ్ షా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లోనే హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
THE DEMON OF DROUGHT –
SIR THEODORE HECTORFrom captivating audiences across the world as ‘Imhotep’ in ‘The Mummy’ to embarking on a new journey as the ruthless ‘SIR THEODORE HECTOR’ in #Ranabaali ❤️🔥
Happy Birthday and welcome to Indian Cinema, #ArnoldVosloo❤️🔥
-Team… pic.twitter.com/zLtnYUsFdA
— Mythri Movie Makers (@MythriOfficial) June 16, 2026