Obsession OTT | రూ. 7 కోట్ల బడ్జెట్.. రూ. 1700 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ హారర్ సెన్సేషన్ ‘అబ్సెషన్’!
Obsession OTT | బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడానికి వందల కోట్ల బడ్జెట్, భారీ గ్రాఫిక్స్ అవసరం లేదని, కేవలం బలమైన కంటెంట్ ఉంటే చాలని నిరూపించింది హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘అబ్సెషన్’ (Obsession).
Obsession OTT | బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడానికి వందల కోట్ల బడ్జెట్, భారీ గ్రాఫిక్స్ అవసరం లేదని, కేవలం బలమైన కంటెంట్ ఉంటే చాలని నిరూపించింది హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘అబ్సెషన్’ (Obsession). ప్రముఖ యూట్యూబర్ కర్రీ బార్కర్ దర్శకత్వంలో కేవలం రూ. 7 కోట్ల రూపాయల అత్యల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1700 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది. హారర్ హిస్టరీలోనే మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన ఈ గ్లోబల్ బ్లాక్ బస్టర్, ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. జూన్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ (Apple TV), పీకాక్ వంటి ప్రముఖ అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌లలో ఈ చిత్రం ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (రెంటల్) విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. ‘బేర్’ అనే ఒక సాధారణ యువకుడు తను ప్రాణంగా ప్రేమించే ‘నిక్కీ’ మనసును గెలుచుకోవడానికి ఒక అతీంద్రియ శక్తి కలిగిన ‘వన్ విష్ విల్లో’ (మ్యాజిక్ స్టిక్)ను విరగ్గొట్టి ఒక కోరిక కోరతాడు. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నిక్కీ తన్నే ప్రేమించాలని అతడు కోరుకుంటాడు. ఆ మ్యాజిక్ స్టిక్ ప్రభావంతో నిక్కీ నిజంగానే బేర్‌తో విపరీతమైన ప్రేమలో పడిపోతుంది. మొదట్లో అంతా సంతోషంగానే సాగినా, రోజులు గడిచే కొద్దీ ఆమె ప్రేమ కాస్త ‘అబ్సెషన్’ (ఒక రకమైన పిచ్చి)గా మారుతుంది. బేర్ అనుక్షణం తన పక్కనే ఉండాలని పట్టుబట్టడం, అతడు వేరే వాళ్లతో మాట్లాడితే తట్టుకోలేకపోవడం, చివరికి అతని కోసం ఏ స్థాయి దారుణాలకైనా, హత్యలకైనా తెగించే సైకోలా నిక్కీ ఎలా మారింది అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సాగుతుంది.
ఈ చిత్రం భారతదేశంలోనూ ఊహించని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం మౌత్ టాక్‌తో మన దేశంలోనే దాదాపు 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో ప్రేక్షకులను వెన్నులో వణుకు పుట్టించిన ఈ విలక్షణ హారర్ డ్రామా, ప్రస్తుతానికి ఓటీటీలలో అన్‌కట్ వెర్షన్‌తో కేవలం ఇంగ్లీష్ భాషలోనే అందుబాటులోకి రానుంది. అయితే త్వరలోనే తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. థియేటర్లలో ఈ హారర్ సెన్సేషన్‌ను మిస్ అయిన వారు ఇప్పుడు హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని డిజిటల్ స్క్రీన్స్ పై దీనిని వీక్షించవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

