James Gunn | తారక్‌తో కలిసి పనిచేయాలనుంది.. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్గన్
NTR | 'ఆర్ఆర్ఆర్' సినిమాతో టాలీవుడ్ రేంజ్ హాలీవుడ్‌కు పాకింది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని తెలుగు ఖ్యాతీని ప్రపంచ శిఖారాగ్రాని నిలబెట్టింది. ఇక రాజమౌళి టేకింగ్, విజన్‌కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు.
NTR | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో టాలీవుడ్ రేంజ్ హాలీవుడ్‌కు పాకింది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని తెలుగు ఖ్యాతీని ప్రపంచ శిఖారాగ్రాని నిలబెట్టింది. ఇక రాజమౌళి టేకింగ్, విజన్‌కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ముఖ్యంగా రామ్‌చరణ్, తారక్‌లు ఈ సినిమాతో హాలీవుడ్లో తిరుగులేని పాపులారిటీ వచ్చింది. వీళ్ల నటనకు హాలీవుడ్ ప్రేక్షకులు వెర్రెత్తి పోయారు. ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఒక్కసారిగ ప్రపంచం దృష్టి మన సినిమాపై పడింది. ఇప్పటికే ఎంతో మంది హాలీవుడ్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు ఈ సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి టేకింగ్ గురించి.. చరణ్, తారక్‌ల నటన గురించి గొప్పగా వర్ణించారు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సిరీస్ డైరెక్టర్ జేమ్స్ గన్, ఎన్టీఆర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ౩ మూవీ మే 5న విడుదల కానుంది. ఈ క్రమంలో జేమ్స్ వరుసగా ప్రమోషన్లు జరుపుతున్నాడు. కాగా ప్రమోషన్లో భాగంగా ట్రిపుల్ఆర్ సినిమా గురించి, ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గార్డియన్స్ ప్రపంచంలోకి ఒక ఇండియా నటుడిని పరిచయం చేయాలనుకుంటే ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తారని’ ఇంటర్వూయర్ జేమ్స్‌ను ప్రశ్నించాడు. ఇక దానికి జేమ్స్ ‘ఆర్ఆర్ఆర్లో సూపర్‌గా కనిపించిన ఆ హీరో ఎవరు?.. అతని పేరు ఏంటి? పులులతో పాటు బోనులోంచి ఓ వ్యక్తి బయటికి వస్తాడు కదా.. అతనితో కలిసి పనిచేయాలని ఉంది. అతను చాలా అద్భుతంగా నటించాడు. ఆ సీన్ చూసి నేను ఫ్యాన్ అయిపోయాను’ అంటూ ఎన్టీఆర్ గురించి చెప్పాడు.
జేమ్స్ గన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కామెంట్స్‌కు నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతంలోనూ ఓ సందర్భంగా తారక్ హాలీవుడ్ సినిమాలో నటించే చాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం తారక్, కొరటాల శివతో ఎన్టీఆర్30 చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.
#GuardiansOfTheGalaxy @JamesGunn wants to work with @tarak9999 🤯❤️🔥❤️🔥🥁🥁. #ManOfMassesNTR pic.twitter.com/cH6crhkhIz
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) April 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

