లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ నటుడు బ్రూస్ విల్స్ .. అరుదైన డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆయన ఫ్యామిలీ ప్రకటించింది. బ్రూస్ విల్స్‌కు ఫ్రెంటోటెంపోరల్ డిమెన్షియా ఉన్నట్లు పరీక్షల్లో డాక్టర్లు గుర్తించారు. దీని వల్ల మతిమరుపు వస్తుంది. నోటి నుంచి మాట కూడా సరిగా రాదు. 67 ఏళ్ల బ్రూస్ గత ఏడాది నుంచి తన మాటతో ఇబ్బందిపడుతున్నాడు. అయితే ప్రస్తుతం అతనికి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు ఫ్యామిలీ సభ్యులు తెలిపారు.
1980, 90 దశకాల్లో బ్రూస్ విల్స్ గొప్ప స్టార్‌గా వెలిగారు. డై హార్డ్, సిక్స్త్ సెన్స్, ఆర్మగెడాన్, పల్ప్ ఫిక్షన్ లాంటి సినిమాలతో ఆయన క్రేజ్ సంపాదించుకున్నారు. అయిదు సార్లు అతను గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయ్యాడు. రెండు ఎమ్మీ అవార్డులు గెలుచుకున్నారు. మూన్‌లైటింగ్ ఫిల్మ్ కోసం అతని గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది.