సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హంట్’. మహేష్ దర్శకుడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాకు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ పనిచేశారు. పోరాట ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతున్నది.
నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ ‘మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చిత్రాలకు పనిచేసిన రేనాడ్ ఫనెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’ సినిమాకు స్టంట్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో సుధీర్‌బాబు పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. అనూహ్య మలుపులతో సాగే హై వోల్టేజ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అని చెప్పారు. శ్రీకాంత్, భరత్, మైమ్ గోపీ, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అరుల్ విన్సెంట్, సంగీతం: జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి, దర్శకత్వం: మహేష్.