ఇలా చూసి ఉండరు
సూర్య నటిస్తున్న 42వ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెడుతున్నది హిందీ తార దిశా పటానీ. చారిత్రక నేపథ్యంతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా పది భాషల్లో త్రీడీ ఫార్మేట్లో రిలీజ్ కానుంది.
సూర్య నటిస్తున్న 42వ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెడుతున్నది హిందీ తార దిశా పటానీ. చారిత్రక నేపథ్యంతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా పది భాషల్లో త్రీడీ ఫార్మేట్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అవకాశం రావడం ఉద్వేగంగా ఉందని చెప్పుకున్నది దిశా పటానీ. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ..‘ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఈ సినిమా అందిస్తుందని చెప్పగలను. ఇప్పటిదాకా నేను కనిపించని సరికొత్త పాత్రలో నటిస్తున్నాను. నా క్యారెక్టర్ వైవిధ్యంగా ఉంటుంది’ అని చెపింది.
ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తు న్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదలైంది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతున్నారు. ఇటీవలే ఏక్ విలన్ రిటర్స్న్ సినిమాతో ప్రేక్షకుల ముందు కొచ్చిన దిశా..ప్రస్తుతం ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్ కె, యోధ, కె టీనా వంటి చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

