Hi Nanna | ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో విజయ్, రష్మిక ఫొటో వివాదం.. స్పందించిన నాని
Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ (Hi Nanna) ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika) ఫొటోలు రావడం వివాదం అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై నాని స్పందించారు.
Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ భామ సీతారామం ఫేం మృణాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తోండగా.. మలయాళ నటుడు జయరాం కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా డిసెంబరు 7న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుక నవంబర్ 29న వైజాగ్‌లోని ఆర్ కే బీచ్ వద్ద ఉన్న గోకుల్ పార్కులో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలో నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మికకు సంబంధించిన ఫొటోలు స్క్రీన్‌పై రావడం చర్చకు దారితీసింది. దీంతో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫొటోలు రావడం పట్ల ఈవెంట్ నిర్వాహకులతోపాటు చిత్రబృందాన్నీ నెటిజన్లు తప్పుబట్టారు. ఈ వివాదం ఇంకా ముదురుతుండటంతో నటుడు నాని (Hi Nanna) తాజాగా స్పందించారు.
నాని మాట్లాడుతూ.. విజయ్, రష్మిక ఫొటోలను స్క్రీన్‌పై వేయడం నిజంగానే దురదృష్టకరం. ఆ ఫొటో చూసి మేము కూడా షాకయ్యాం. అలాంటి ఈవెంట్స్ కోసం ఎంతోమంది వర్క్ చేస్తుంటారు. ఇక మేమంతా స్నేహితులమే. సినిమా ప్రమోషన్స్‌లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వాళ్లకు కూడా తెలుసు. ఆ చర్య వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే నాతోపాటు చిత్రయూనిట్ అంతా క్షమాపణలు చెబుతున్నాం అంటూ నాని చెప్పుకోచ్చాడు.
ఇక తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. హాయ్ నాన్నలో బేబీ కియారా, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

