నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకుడు. వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నది. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. తండ్రీకూతుళ్ల అనుబంధానికి అందమైన దృశ్యరూపంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీజర్‌ను ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
‘ఇటీవల విడుదలైన ‘గాజు బొమ్మ’ అనే పాటకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. తన కూతురే సర్వస్వంగా బతికే ఓ తండ్రి కథగా ప్రేక్షకుల్ని ఉద్వేగానికి లోను చేస్తుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సానుజాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, దర్శకత్వం: శౌర్యువ్.