Hi Nanna Movie | ‘దసరా’ రికార్డును టచ్ చేయలేకపోయిన నాని.. ‘హాయ్ నాన్న’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.?
Actor Nani | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కిన ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తాజాగా ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Hi Nanna Movie Collections | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కిన ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తాజాగా ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా రివ్యూలు చూసుకుంటే.. హాయ్ నాన్న ఒక ఎమోషనల్ రైడ్ అని చెబుతున్నారు. ముఖ్యంగా కథలోని భావోద్వేగాలు, మలుపులు, నాని, మృణాల్, బేబి కియారా నటన, సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయని చెబుతున్నారు. అయితే సినిమా పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్లు మాత్రం డల్‌గా కనిపిస్తున్నాయి.
ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు చూసుకుంటే.. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా పదకొండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను, ఐదున్నర కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో మొదటిరోజు కేవలం రెండు కోట్ల తొంభై లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. నాని గత సినిమా దసరా తొలిరోజు 14 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకోగా ఆ సినిమా దరిదాపుల్లోకి కూడా హాయ్ నాన్న నిలవకపోవడం విశేషం. ఇక యానిమల్ లాంటి మాస్ మసాలా మూవీకి జనాలు ఎక్కువగా వెళుతుండడంతో ఆ సినిమా కలెక్షన్లు హాయ్ నాన్న సినిమా డే 1 కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించాయి.
కథలోకి వెళితే.. ముంబైకి చెందిన విరాజ్(నాని) ఓ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. తన కూతురు మహి(బేబీ కియారా ఖన్నా) అంటే విరాజ్‌కు ప్రాణం. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడతున్న మహికి అన్నీ తానై చూసుకుంటాడు. అయితే ప్రతి రోజు రాత్రి కూతురికి సరదాగా కథలు చెప్పడం విరాజ్‌కి అలావాటు. ఆ కథల్లోని హీరో పాత్రని నాన్నతో పోల్చుకోవడం మహికి అలవాటు. ఓ సారి అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే చెబుతానంటాడు. అమ్మ కథ కోసం కష్టపడి చదివి క్లాస్ ఫస్ట్ వస్తుంది. అయినా మహికి తన అమ్మ కథని చెప్పడు విరాజ్. అయితే మహీకి అమ్మ గురించి చెప్పడానికి విరాజ్ ఎందుకు ఆలోచిస్తుంటాడు. అసలు విరాజ్ భార్య ఎవరు, ఆమె ఎందుకు విరాజ్‌ను వదిలేసి వెళ్ళిపోయింది ?, విరాజ్ జీవితంలోకి యశ్న (మృణాల్ ఠాకూర్) ఎలా వస్తోంది ? అనేది తెలియాలంటే హాయ్ నాన్న మూవీ చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

