పదహారు హిట్లు కొట్టాలి!
‘ఈ ఆడిటోరియం నాకు చాలా ప్రత్యేకం. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా టైంలో ఇక్కడకు వచ్చాను. వరుసగా ఎనిమిది హిట్లు కొట్టా. ఈసారి పదహారు హిట్లు కొట్టకుండా బ్రేక్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఫిక్సైపోయా’ అన్నారు హీరో నాని.
‘ఈ ఆడిటోరియం నాకు చాలా ప్రత్యేకం. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా టైంలో ఇక్కడకు వచ్చాను. వరుసగా ఎనిమిది హిట్లు కొట్టా. ఈసారి పదహారు హిట్లు కొట్టకుండా బ్రేక్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఫిక్సైపోయా’ అన్నారు హీరో నాని. ఆయన కథానాయకుడిగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హాయ్ నాన్న’ సినిమాలోని ‘అమ్మాడి..’ అనే పాటను హైదరాబాద్ శివారులోని బిట్స్ కళాశాల క్యాంపస్‌లో లాంచ్ చేశారు.
నాని మాట్లాడుతూ ‘థియేటర్‌కు వెళ్లి మంచి ప్రేమకథ చూసి చాలా రోజులైంది. ఈ సినిమాలో మీకు కావాల్సినంతం ప్రేమ దొరుకుతుంది. ఈ కథలో గొప్ప మ్యాజిక్ ఉంది. అది మీ అందరికి నచ్చుతుంది’ అన్నారు.
‘సీతారామం’ చిత్రంలోని సీత పాత్ర తరహాలోనే ఈ సినిమాలో పోషించిన యష్నా పాత్ర ప్రేక్షకుల మనసుకు హత్తుకుంటుందని మృణాల్ ఠాకూర్ చెప్పింది. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయని, డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొస్తున్నదని దర్శకుడు శౌర్యువ్ తెలిపారు. వైర ఎంటర్టైన్మెంట్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

