Hi Nanna Movie | టాలీవుడ్ స్టార్ హీరో నాని (Nani) ప్రధాన పాత్రలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కిన ఈ సినిమాను శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఇందులో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 07న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. రిలీజైన అన్ని భాషల్లో భారీ వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. ఈ మూవీలోని అమ్మాడి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను చిత్ర యునిట్ యూట్యూబ్ వేదికగా విడుదల చేసింది. ఈ సాంగ్ నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ పాటను నా మాతృభాష తెలుగులో రాసాను. ఇది అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను అంటూ మృణాళ్ ఠాకూర్ వాయిస్‌తో సాంగ్ మొదలవుతుంది. ‘ప్రాణం అల్లాడి పొద అమ్మాడి’ ‘అందం కట్టేసుకుంటే అమ్మాడి’.. ‘ఇంకా కలలోనే ఉన్న అమ్మాడి’.. అంటూ ఈ పాట సాగింది. కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ ఆలపించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. ఇక ఈ సాంగ్‌లో నాని, మృణాల్‌ల పెళ్లి అయ్యినట్లు కనిపించడం. చూస్తుంటే ఈ జోడీ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది.
ఈ మూవీలో నాని కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా నటించింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మలయాళ కంపోజర్, హృదయం, ఖుషీ చిత్రాల ఫేం హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందించాడు.