తన కొత్త సినిమా ‘తంగలాన్’ షూటింగ్లో హీరో విక్రమ్ గాయపడ్డారు. ఆయన పక్కటెముకలకు గాయాలైనట్లు సమాచారం. చెన్నైలో ఈ సినిమా కోసం రిహార్సల్స్ చేస్తున్న సమయంలో విక్రమ్ గాయపడ్డారు. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు పా.రంజిత్. ఈ చిత్రంలోని ప్రమాదకర స్టంట్స్ నేర్చుకునే క్రమంలో విక్రమ్ గాయపడినట్లు సమాచారం. ప్రమాదవార్త తెలుసుకున్న అభిమానులు, పరిశ్రమ వాసులు విక్రమ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. విక్రమ్ నటించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ సినిమా ఇటీవలే విడుదలై మంచి పేరు తీసుకొచ్చింది.