సుమంత్ మామూలోడు కాదు.. మాస్టర్ ప్లాన్‌తో ప్రమోషన్ అదుర్స్..!

హైదరాబాద్ : హీరో సుమంత్‌కు ఒకప్పుడు మంచి మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. ఆయన సినిమాలు చేస్తున్న సంగతి కూడా ప్రేక్షకులకు గుర్తులేదు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో సుమంత్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన కూడా ఎవరూ పట్టించుకోరు. అలాంటిది ఇప్పుడు సుమంత్ సినిమా గురించి అన్ని మీడియా ఛానల్స్ కవర్ చేశాయి. సోషల్ మీడియాలో కూడా ఈయన సినిమా పేరు మార్మోగిపోతోంది. దానికి చిత్రయూనిట్ వేసిన మాస్టర్ ప్లాన్ ప్రధాన కారణం. హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు బాగా వచ్చాయి.
అయితే దీనిపై సుమంత్ స్పందించాడు. రెండో పెళ్లి చేసుకోవడం లేదు అని.. అలాంటి వార్తలన్నీ అబద్ధాలు అంటూ కొట్టిపారేశారు. తన కొత్త సినిమా పెళ్లి, విడాకులు కాన్సెప్టుతో తెరకెక్కుతోంది అని చెప్పాడు సుమంత్. ఇక్కడే అందరికీ ఒక అనుమానం వస్తుంది. నిజంగానే తన కొత్త సినిమా స్టిల్ వీళ్లే లీక్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఒక సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ వరస ఫ్లాపుల్లో ఉన్న సుమంత్ లాంటి హీరో సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవాలంటే ఏదైనా ఒకటి స్పెషల్‌గా చేయాలి. ఆ స్పెషల్ సుమంత్ రెండో పెళ్లి టాపిక్.
సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ వార్తలు బయటకు వచ్చిన వెంటనే వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దాంతో ఇది కూడా బాగా వైరల్ అవుతుంది. కీర్తి కుమార్ అనే కొత్త దర్శకుడు మళ్ళీ మొదలైంది సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పెళ్లి జీవితం, విడాకులు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నైనా గంగూలి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తో బిజీగా ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. మొత్తానికి ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అన్నట్లు ఒక ప్లాన్ సినిమా ప్రమోషన్ కు బాగా ఉపయోగపడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

