వాణిజ్య పంథాలోనే కొత్తదనంతో కూడుకున్న కథాంశాల్ని ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు హీరో సుమంత్. తాజాగా ఆయన ‘అహం రీబూట్’ పేరుతో ఓ వినూత్న కథా చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్‌సాగర్ అట్లూరి దర్శకుడు. రఘవీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మాతలు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకొంది. ముహూర్తపు సన్నివేశానికి శరణ్ కొప్పిశెట్టి క్లాప్‌నివ్వగా, దర్శకుడు చందు మొండేటి కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో సుమంత్ ఆర్జే పాత్రలో కనిపిస్తారు. అహం అంటే నేను..అహం రీబూట్ అంటే సెల్ఫ్ రీబూట్..అహం అంటే పొగరు, ద్వేషం అని కాకుండా నేను అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వరుణ్ అంకర్ల, సంగీతం: శ్రీరామ్ మద్దూరి, నిర్మాణ సంస్థ: వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ ఒరిజినల్స్, రచన-దర్శకత్వం: ప్రశాంత్ సాగర్ అట్లూరి.