వేసవిలో సకుటుంబ వినోదం
‘ఈ సినిమా ట్రైలర్ లడ్డూలా ఉంది. టైటిల్ కూడా జనాల్లోకి బాగా చేరిపోయింది. వేసవిలో ప్రతి ఒక్కరిని అలరించే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు అగ్ర హీరో నాని. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘అన్నీ మంచి శకునములే’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
‘ఈ సినిమా ట్రైలర్ లడ్డూలా ఉంది. టైటిల్ కూడా జనాల్లోకి బాగా చేరిపోయింది. వేసవిలో ప్రతి ఒక్కరిని అలరించే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు అగ్ర హీరో నాని. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘అన్నీ మంచి శకునములే’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘సంతోష్‌శోభన్ నటన నాకు బాగా నచ్చుతుంది.
దర్శకురాలు నందినికి సంతోష్ రూపంలో మరో నాని దొరికాడు (నవ్వుతూ). ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరింది’ అన్నారు. వైజయంతీ మూవీస్ తనకు ఫ్యామిలీ లాంటిదని, ఈ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని దుల్కర్ సల్మాన్ ఆకాంక్షించారు. తన కెరీర్లో ఎన్నో ప్రత్యేకతలు కలబోసిన చిత్రమిదని హీరో సంతోష్ శోభన్ తెలిపారు. నిర్మాత స్వప్నదత్ మాట్లాడుతూ ‘వేసవి సెలవుల్లో మన అమ్మమ్మ ఇంటికి వెళ్లి మామిడికాయ తిన్నంత అనుభూతి పంచుతుందీ చిత్రం.
చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇంటిల్లిపాదిని మెప్పిస్తుంది’ అని చెప్పింది. ఈ సినిమా కోసం షావుకారు జానకి వంటి సీనియర్ నటులతో పనిచేయడం గర్వంగా ఉందని, సకుటుంబ కథా చిత్రంగా అలరిస్తుందని దర్శకురాలు నందిని రెడ్డి పేర్కొంది. ఈ కార్యక్రమంలో దర్శకులు హను రాఘవపూడి, అనుదీప్, నరేష్ వీకే, చిత్ర కథానాయిక మాళవిక నాయర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

