ఎక్కువ మంది కొత్త దర్శకులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత హీరో నాగార్జునకు దక్కుతుంది. సినిమాను కొత్త తెరపై ఆవిష్కరించగల సృజనాత్మకత కొత్త దర్శకుల్లో ఉంటుందని ఆయన నమ్మడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో నాగార్జునకు హిట్స్‌తో పాటు ఫ్లాప్స్ కూడా ఎదురయ్యాయి. సుదీర్ఘ కెరీర్లో వంద చిత్రాలకు చేరువవుతున్నారు నాగార్జున. తను పద్ధతిని కొనసాగిస్తూ ‘ధమాకా’ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్‌తో ఆయన తన కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి ఇటీవల కొన్ని వదంతులు వచ్చాయి.
కథలో సృజనాత్మక బేధాల వల్ల ప్రసన్న కుమార్ నాగార్జున సినిమాను పక్కన పెట్టారన్నది ఆ రూమర్స్ సారాంశం. ఈ సినిమా మలయాళ రీమేక్ మాటలూ వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఈ ప్రాజెక్ట్‌కు సన్నిహితంగా ఉండేవాళ్లు చెబుతున్నారు. నాగార్జున 99వ చిత్రంగా ఈ సినిమా మన కథతోనే తెరకెక్కుతుందని వారంటున్నారు. ఇక నాగార్జున 100 చిత్రానికి కూడా ప్లానింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం. ‘గాడ్‌ఫాదర్’ చిత్ర దర్శకుడు మోహన్ రాజా ఈ ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కిస్తారని తెలుస్తున్నది.