Ashok Galla | అశోక్ గల్లా రెండో సినిమా షురూ.. వివరాలివే
చాలా కాలం తర్వాత రెండో ప్రాజెక్ట్‌ను లాంఛ్ చేశాడు మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla). ఈ మూవీ నేడు పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది.
హీరో సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla). ఈ సినిమా వచ్చిన చాలా కాలం తర్వాత రెండో ప్రాజెక్ట్‌ను లాంఛ్ చేశాడు అశోక్. ఈ మూవీ నేడు పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. నమ్రతా శిరోద్కర్ కెమెరా స్విఛాన్ చేయగా.. విక్టరీ వెంకటేశ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. మిర్యాల రవిందర్ రెడ్డి, సాహు గారపాటి, హరీష్ పెద్ది స్క్రిప్ట్‌ను మేకర్స్ కు అందించారు.
జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథనందిస్తుండటం విశేషం. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహిస్తున్నాడు. లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ వన్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని సోమినేని బాలకృష్ణ (ఎన్ఆర్ఐ) నిర్మిస్తున్నారు. యూనిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అశోక్ గల్లా పూర్తిగా మేకోవర్ మార్చుకున్నట్టు తాజా లుక్‌తో తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో ఆది శేషగిరిరావు, బీవీఎస్ రవి, గల్లా జయదేవ్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారు.. ఇతర నటీనటులు, సాంకేతికి నిపుణులు ఎవరెవరు పనిచేయబోతున్నారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అశోక్ గల్లా కొత్త సినిమా లాంఛింగ్ స్టిల్స్..
#AshokGalla2 Launched with a formal pooja ceremony❤️
Clap by @VenkyMama
1st shot Dir #BoyapatiSreenu
🎥Switch On #NamrataGhattamaneni
📝 #MiryalaRavinderReddy@PrasanthVarma @sahugarapati7 @harish_peddi@AshokGalla_ @ArjunJandyala #BheemsCeciroleo #SBalakrishna @lalithambikaoff pic.twitter.com/7zytDh18aC— BA Raju's Team (@baraju_SuperHit) February 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

