Bhagavanth Kesari | ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్ కేసరి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Bhagavanth Kesari | సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) వరుస విజయాలతో ఊపుమీదున్నారు. ఆయన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నటించిన యాక్షన్ చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌ను అందుకున్నది.
Bhagavanth Kesari | సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) వరుస విజయాలతో ఊపుమీదున్నారు. ఆయన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నటించిన యాక్షన్ చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌ను అందుకున్నది. ఇప్పుడు ఓటీటీ (OTT) వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నది.
బాలకృష్ణ సరసన కాజల్ (Kajal Aggarwal) నటించగా, శ్రీలీల కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించగా.. ఆర్ శరత్‌కుమార్, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం 30 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్‌వైడ్‌గా రూ.140 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ ఏడాది మొదట్లో విడుదలైన ‘వీర సింహా రెడ్డి’ తర్వాత మరోసారి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన బాలయ్య రెండో సినిమాగా భగవంత్ కేసరి నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

