Bigg Boss: బిగ్ బాస్ హౌజ్‌లో హీరో ఎవరు, విలన్ ఎవరు?

శనివారం రోజు హౌజ్ మేట్స్‌లో హీరో,విలన్ ఎవరో చెప్పాలని నాగార్జున చెప్పడంతో హీరో అనుకున్న వాళ్లకి బ్యాడ్జ్ పెట్టారు.. విలన్ అనుకున్న వారికి క్రాస్ స్టాంప్ వేశారు .ముందుగా సిరితో గేమ్ స్టార్ట్ చేయించగా, ఆమె హీరో షణ్ముఖ్ అని అందరికి తెలిసిందే. అతనికే బ్యాడ్జ్ తగిలించింది. ఇక విలన్ అంటూ ప్రియాంకకి స్టాంప్ వేస్తుంది సిరి. ప్రియాంక.. సిరిని విలన్‌గా పెయింట్ స్టాంప్ వేస్తుంది. ‘హీరో అయితే మానస్ సార్’ అంటూ బ్యాడ్జ్ తగిలిస్తుంది.
శ్రీరామ్.. విశ్వాని హీరోగా చెబుతూ, విలన్‌గా సిరికి స్టాంప్ వేస్తాడు. కాజల్.. ఆనీని విలన్ అంటూ.. ‘ఆమె నన్ను విలన్‌గా చూస్తున్నారు.. కనీసం కూర్చుని మాట్లాడుకుని క్లియర్ చేసుకుందాం అన్నా అవకాశం ఇవ్వట్లేదు అందుకే విలన్’ అంటూ క్లారిటీ ఇచ్చింది. మరోవైపు హీరోగా మానస్‌ని చేస్తుంది. సన్నీ.. జెస్సీకి హీరోగా బ్యాడ్జ్ పెడతాడు. ప్రియాంక సరిగా ఆడటం లేదు అని విలన్ స్టాంప్ వేస్తాడు.
రవి.. విశ్వని హీరోగా చెప్పి బ్యాడ్జ్ పెడతాడు. ‘మొదటి నుంచి ఇప్పటి దాకా నమ్మకం విషయంలో కానీ, ఇంట్లో ఏ పనిచెయ్యాలన్నా విశ్వన్నేకరెక్ట్గా చేస్తాడు. తనే హీరో’ అని చెప్పాడు. విలన్‌గా షణ్ముఖ్‌ని సెలెక్ట్ చేస్తాడు.ఇక షణ్ముఖ్ .. రవిని విలన్‌గా ఎంచుకుంటాడు. కారణం నాకు ఎప్పటికీ తనే విలన్.. తను విలన్ అయితే నేను హీరోని అవుతాను అంటూ భారీ డైలాగ్స్ చెబుతాడు. తర్వాత సిరి హీరోని చేస్తూ.. ‘అబ్బాయిలకంటే బీభత్సంగా ఆడుతుంది సార్ ఈ అమ్మాయి గేమ్’ అంటూ పొగిడేస్తాడు.
అనీ మాస్టర్.. కాజల్‌ని విలన్ అంటూ విశ్వని హీరోగా చేస్తుంది. ఇక విశ్వ.. శ్రీరామ్‌ని హీరోగా అభివర్షిస్తూ స్టార్ ఇచ్చాడు. ప్రియాంక వల్ల తాను కొన్ని సందర్బాల్లో హర్ట్ అవుతున్నా అని ఆమెను విలన్ అంటూ స్టాంప్ గుద్దాడు. జెస్సీ.. తనకి హెల్త్ బాలేకపోవడంతో అమ్మలా ఆదరిస్తుందంటూ సిరికి స్టార్ ఇచ్చాడు జెస్సీ. ఇక కాజల్ గేమ్‌లో డల్ అవుతుందని అంటూ విలన్ స్టాంప్ గుద్దాడు జెస్సీ. మానస్.. ప్రియాంకని తన హీరో అంటూ స్టార్ ఇచ్చేశాడు. ఇక విలన్‌గా రవికి స్టాంప్ గుద్దాడు మానస్.
మొత్తానికి ఈ టాస్క్‌లో ఎక్కువ స్టార్లు రావడంతో విశ్వ.. హీరో ఆఫ్ ది హౌస్‌గా నిలిచాడు. విలన్‌గా ప్రియాంకను ఎక్కువ మంది నామినేట్ చేయడంతో ఈవారం విలన్‌గా మారింది ప్రియాంక. నామినేషన్లో ఉన్నవారిలో రవి, సిరి, సన్నీలను నాగ్ సేవ్ చేయగా డేంజర్ జోన్లో జెస్సీ, కాజల్, శ్రీరామ్, ప్రియాంక, విశ్వ ఉన్నారు. ఈ ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

