నాకో హిట్ సినిమా కావాలి
చోర్ బజార్ సినిమాలో కొత్త తరహా హీరోయిజం చూస్తారు అని అంటున్నారు ఆకాష్ పూరి. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాను జీవన్ రెడ్డి తెరకెకించారు. వీఎస్ రాజు నిర్మాత. యూవీ క్రియేషన్స్ సమర్పిస్తున్నది. రేపు ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు ఆకాష్ పూరి.
ఈ సినిమాలో హీరో బచ్చన్ సాబ్ పాత్ర బాగుంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తి అతను. చోర్ బజార్ ఏరియా అంటే మనం అకడి వాళ్లు దొంగతనాలు చేస్తారు అనుకుంటాం. కానీ దగ్గరగా చూస్తే వాళ్ల జీవితాలు వేరుగా ఉంటాయి. అకడి మనుషులు, కుటుంబాలు, వాళ్ల కష్టాలు అవన్నీ ఈ సినిమాలో చూస్తారు. హీరో టైర్లు విప్పి అమ్మే దొంగ. ఆ డబ్బుతో అకడి పేదవారికి సాయం చేస్తుంటాడు. నేను ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లో ఇది భిన్నమైనది. పూర్తి కమర్షియల్ అంశాలతో హీరోయిజం ఎలివేట్ చేస్తూ సాగుతుంది. దర్శకుడు జీవన్ రెడ్డి తన గత చిత్రాల్లోనూ హీరోయిజం బాగా చూపించారు. నాకు కొత్త ఇమేజ్ క్రియేట్ అవుతుందని ఆశిస్తున్నాను.
ైస్టెలిష్ యాక్షన్‌తో..
ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సె్టైలిష్గా ఉంటాయి. కె్లైమాక్స్ పదిహేను నిమిషాలు ఆకట్టుకుంటుంది. ఫైట్ మాస్టర్ పృథ్వీ ఫైట్స్ బాగా కంపోజ్ చేశారు. ఈ సినిమాలో వజ్రం ఒక క్యారెక్టర్‌గా కనిపిస్తుంది. హీరోయిన్ మూగ అమ్మాయిగా కనిపించడం కొత్తదనం తెస్తుంది. మూగ అమ్మాయి అంటే మనం జాలి పడతాం కానీ వాళ్లు మాకేం తకువ అనే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మాటలు రాకున్నా హీరోయిన్ స్పీకర్ పెట్టి సినిమా డైలాగ్స్‌తో సమాధానం చెబుతుంది.
ధైర్యంగా ముందుకెళ్లమన్నారు
పాటలు, ట్రైలర్ చూశాక నాన్న పూరి జగన్నాథ్ ..సినిమా బాగుందిరా అని చెప్పారు. నీ సినిమాల నిర్ణయాలు నువ్వే తీసుకో, ధైర్యంగా ముందుకెళ్లు అంటారు ఆయన. నాకు ఒక హిట్ సినిమా కావాలి. అందుకోసం ప్రయత్నిస్తున్నా. చోర్ బజార్ సినిమాలో ఒక కొత్త ప్రపంచం చూస్తారు. సినిమాను థియేటర్లో చూస్తేనే గౌరవం. రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

