Actor Ajith | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు గత రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. తన అభిమాన హీరోకు ఏం జరిగిందో అంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా అజిత్ హెల్త్‌పై అప్డేట్ వచ్చింది. అజిత్ ప్రస్తుతం చెవి నొప్పితో బాధపడుతుండగా గురువారం సర్జరీ జరిగింది. దీంతో అజిత్ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక త్వరలోనే విదాముయార్చి సినిమా షూటింగ్ కోసం అజర్‌బైజాన్‌కు బయలు దేరనున్నట్లు సమాచారం. గతేడాది తెగింపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ మంచి విజయాన్ని అందుకున్నాడు.