‘రామ్అసుర్’ చిత్రం తాము ఊహించినదానికంటే పెద్ద విజయాన్ని సాధించిందని అన్నారు అభినవ్సర్ధార్. ఆయన హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో అభినవ్సర్ధార్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘కృత్రిమంగా వజ్రం తయారు చేయడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. ఆ పాయింట్‌ను నమ్మి నిజాయితీగా సినిమా చేశాం. తొలుత ఓటీటీ కోసం చిన్న బడ్జెట్లో చేయాలనుకున్నాం. పెద్ద స్పాన్ ఉన్న కథ కావడంతో బడ్జెట్ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించాం. ఈ ప్రయత్నంలో వందశాతం విజయవంతం అయ్యాం. ప్రేక్షకులు చక్కటి విజయాన్ని అందించారు. బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే సినిమాల్లో నటిస్తున్నా. నటుడిగా నా ప్రతిభను నిరూపించుకునే చాలెంజెస్ క్యారెక్టర్స్ కోసం ఎదురుచూస్తున్నా. హీరోగానే కాకుండా విలన్ క్యారెక్టర్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. తమిళంలో అవకాశాలొస్తున్నాయి. ప్రస్తుతం ‘మిస్టేక్’ అనే సినిమాలో నటిస్తున్నా. నెగెటివ్ షేడ్స్‌తో కొత్త గెటప్‌లో కనిపిస్తా’ అని తెలిపారు.