Kaithi 2 | లైనప్‌లో వరుస సినిమాలు.. లోకేశ్ కనగరాజ్ ఏడో సినిమా ఇదే
Kaithi 2 | లోకేశ్ కనగరాజ్(lokesh kanagaraj) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. రికార్డుల గురించే చర్చ ఉంటుంది. ఈ స్టార్ డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టి చాలా బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టుల్లో తలైవా 171 (Thalaivar 171)తోపాటు ఖైదీ, విక్రమ్ సీక్వెల్స్ ఉన్నాయి.
Kaithi 2 | తక్కువ టైంలోనే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) . ఈ దర్శకుడి కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. రికార్డుల గురించే చర్చ ఉంటుంది. ఈ స్టార్ డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టి చాలా బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టుల్లో తలైవా 171 (Thalaivar 171)తోపాటు ఖైదీ, విక్రమ్ సీక్వెల్స్ ఉన్నాయి.
అయితే ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ ఆరో సినిమా లియోతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటే వరుస సినిమాలను లైనప్‌లో ఉంచిన లోకేశ్ కనగరాజ్ ఇంతకీ నెక్ట్స్ చేయబోతున్న ఏడో సినిమా ఏంటని తెగ చర్చించుకోవడం మొదలుపెట్టారు మూవీ లవర్స్. తాజాగా ఈ డైలామాకు చెక్ పెట్టే అప్డేట్ వచ్చేసింది. లోకేశ్ తీయబోయే ఏడో సినిమా ఖైదీ 2.
కార్తీ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఖైదీ (Kaithi) తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్ ఖైదీ 2 (Kaithi2 ) 2023లో సెట్స్‌పైకి వెళ్తుందని గతంలోనే చెప్పాడు లోకేశ్ కనగరాజ్. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చేసి పుకార్లకు చెక్ పెట్టేశాడు. మొత్తానికి లోకేశ్ ఖైదీ 2 తర్వాత మిగిలిన సినిమాలపై ఫోకస్ పెట్టబోతున్నాడని తాజా అప్డేట్తో క్లారిటీ వచ్చేసింది.
విజయ్ టైటిల్ రోల్ పోషించిన యాక్షన్ ఎంటర్టైనర్ లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. లోకేశ్ కనగరాజ్ మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కూడా సినిమా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే తన సినిమా అని కూడా హింట్ ఇచ్చేశాడు.
My 7th film will be #Kaithi2 🔥
– Lokesh Kanagaraj pic.twitter.com/HqTe5l6fLf
— Christopher Kanagaraj (@Chrissuccess) October 8, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

