వలిమై ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్స్ చేసిన అజిత్..
Valimai First Day Collections | అజిత్ మరోసారి రికార్డులు తిరగరాశాడు. ఆయన సినిమా వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు కూడా కొత్త సినిమాతో రికార్డులు తిరగ రాస్తున్నాడు అజిత్. టాక్ ఎలా ఉంది అనేది పక్కన పెడితే మొదటిరోజు రికార్డ్స్ అయితే బద్దలైపోయాయి. చాలా రోజుల తర్వాత సౌత్ ఇండియాలో విడుదలైన మొదటి భారీ సినిమా వలిమై. డ్రగ్స్ నేపథ్యంలో అజిత్ హీరోగా వినోద్ తెరకెక్కిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోవడం లేదు.
పైగా ఇక్కడ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విడుదల కావడంతో రెండో రోజు నుంచి అజిత్ సినిమాను థియేటర్స్ తీసేశారు. ఇదిలా ఉంటే మొదటి రోజు మాత్రం వలిమై సినిమా రికార్డులు తిరగరాసింది. తమిళనాడులో అజిత్ సినిమాకు రికార్డు ఓపెనింగ్స్ వచ్చాయి. మొన్నటి వరకూ విజయ్ మాస్టర్ సినిమా పేరు మీద ఉన్న రికార్డ్స్ అన్ని చెరిగిపోయాయి. వలిమై సినిమా మొదటి రోజు ఏకంగా 34 కోట్ల గ్రాస్ వసూలు చేసింది అంటూ అక్కడ ట్రేడ్ విశ్లేషకుడు రమేష్ బాల ట్వీట్ చేశాడు. మరోవైపు తెలుగులో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక్కడ కూడా రూ.2 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు తెలుస్తోంది.
హిందీ, ఓవర్సీస్ అన్ని కలిపి మొదటి రోజు దాదాపు రూ.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది వలిమై సినిమా. షేర్ రూ. 35 కోట్లకు పైగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల బిజినెస్ చేసింది వలిమై. రెండో రోజు నుంచి మిగిలిన రాష్ట్రాల్లో వసూలు పెద్దగా రావడం లేదు. కానీ తమిళంలో మాత్రం ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి వీకెండ్ అయ్యేసరికి 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అయిపోయింది. ఆ తర్వాత అజిత్ సినిమా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా మొదటి రోజు రికార్డుల్లో మాత్రం అజిత్ మరోసారి కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అనిపించుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Ajith Kumar
- Box office
- valimai
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

