మనోజ్గోపాల్కృష్ణ, శ్రీ ఇందు నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘హలో జాను’. మంజుల సరోజు దర్శకురాలు. ఎస్.ఎమ్.క్రియేషన్స్, సుముధ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గురువారం ఈ చిత్రం ప్రారంభమైంది. దర్శకురాలు మాట్లాడుతూ ‘రొమాన్స్, వినోద అంశాలతో తెరకెక్కించబోతున్నాం. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. నేటి యువతరం మెచ్చే అన్ని అంశాలుంటాయి. ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని చెప్పింది. ‘నేను తెలుగు అబ్బాయినే. కొన్ని కన్నడ చిత్రాల్లో నటించా. తెలుగులో నాకిది తొలి సినిమా. చక్కటి ప్రేమకథా చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని హీరో మనోజ్గోపాల్కృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వేణు ఆర్మ్స్, సంగీతం: యూవీ నిరంజన్.